అణగారిన వర్గాల కోసం పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల కోసం పోరాటాలు

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

అణగారిన వర్గాల కోసం పోరాటాలు

నెహ్రూసెంటర్‌: జిల్లా కేంద్రంలో గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు 50మంది సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. నక్క సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా నాగయ్య మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం అనేకమైన ప్రజా పోరాటాలు నడిపిన చరిత్ర సీపీఎం పార్టీదన్నారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్వీ.రమ, పగిడిపాల తిరుపతమ్మ, ఈరెల్లి మల్లేశం, అడ్డూరు బ్రహ్మచారి, జల్లి మల్లేశం స్రవంతి, మన్యం మల్లేష్‌, జనగం వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement