డోర్నకల్: మండలంలోని రావిగూడెం శివారులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, పామాయిల్ చెట్లు దగ్ధమయ్యాయి. ముల్కలపల్లికి చెందిన రైతు సామినేని చినబాబురావు రావిగూడెం సమీపంలో తన వ్యవసాయ భూమిలో జామాయిల్, పామాయిల్ తోటలు సాగు చేస్తున్నాడు. మంగళవారం సమీప వ్యవసాయ భూముల్లో పంట కొయ్యలను దగ్ధం చేసేందుకు కొంతమంది నిప్పంటించగా మంటల వ్యాపించి పక్కనే ఉన్న పామాయిల్, జామాయిల్ తోటకు అంటుకుని కొన్ని చెట్లు దగ్ధమయ్యాయి. డోర్నకల్ నుంచి ఫైరింజన్ ఘటనాస్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలకు నష్టం వాటిల్లింది.


