ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌

రైతుల వద్ద వసూలు చేస్తున్న డబ్బులు ఎవరికి?

బయ్యారం: మక్కల కాటా నుంచి రవాణా అయ్యే వరకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తాలు త్వరితగతిన పంపిస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు చెప్పి వారి వద్ద వసూలు చేస్తున్న డబ్బులు ఎవరిచేతికి చిక్కుతున్నాయనే ప్రశ్నలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. సొసైటీ ఆధ్వర్యంలో బయ్యారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో లారీ ఎక్కిన 50కేజీల బస్తాకు 10రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా ఇదే సొసైటీ ఆధ్వర్యంలో ఉప్పలపాడులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 50 కేజీల బస్తాకు 14రూపాయల చొప్పున వసూలు చేశారు. కాగా బస్తాకు వసూలు చేస్తున్న రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అనే విషయంపై కేంద్రాల నిర్వాహకులు లారీ డ్రైవర్లకు ఇస్తున్నామని చెబుతుండగా లారీ డ్రైవర్లు తమకు ఇవ్వడం లేదని చెబుతుండడం గమనార్హం. ఈ డబ్బుల వసూళ్లపై జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులపై పడుతున్న అదనపుభారంను నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది.

నెల్లికుదురు: ఆగిఉన్న ట్రాక్టర్‌ను మోటార్‌ సైకిల్‌ ఢీకొట్టిన ఘటనలో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రామన్నగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన బొర్ర పాషా, చందపాక జంపయ్య, రామకృష్ణ ముగ్గురు కలిసి సొంత పనులపై నెల్లికుదురుకు వెళ్లి తిరిగి రామన్నగూడెం వస్తున్నారు. రామన్నగూడెం చెరువు కట్టపై ఆగిఉన్న ట్రాక్టర్‌ను గమనించక రాత్రి సమయం కావడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ను మోటార్‌ సైకిల్‌ ఢీకొట్టింది. ఈఘటనలో మోటార్‌ సైకిల్‌పై ఉన్న ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు ట్రాక్టర్‌పై గాయనడిన ముగ్గురిని నెల్లికుదురు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి చికిత్స కోసం 108 విహనంలో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement