గూడూరు: మండల కేంద్రంతో పాటు గ్రామాలలో నిత్యం అనుమానం కల్గితే తనిఖీలు చేపట్టాలని సీఐ వినయ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు.
మత్తు పదార్థాల
నిర్మూలన అందరి బాధ్యత
డోర్నకల్: సమాజానికి పెనుభూతంగా మారిన మత్తు పదార్థాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని డోర్నకల్ సీఐ ఈ.చంద్రమౌళి కోరారు. డోర్నకల్ రైల్వేస్టేషన్‌తోపాటు పలు ప్రాంతాల్లో మంగళవారం డాగ్ స్క్వాడ్‌తో కలిసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గార్ల: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అర్హులైన లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని ఎంపీడీఓ మంగమ్మ మంగళవారం తెలిపారు. కుటుంబ పోషకుడు, పోషకురాలు 2017 ఏప్రిల్ 13 తర్వాత మరణించిన వారు ఈ పథకానికి అర్హులన్నారు. మీసేవా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం ద్వారా రూ.20వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆమె వెల్లడించారు. దరఖాస్తును ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా
కిషన్‌నాయక్
మహబూబాబాద్: రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ సామాజిక ఉద్యమకారుడిగా గుగులోత్ కిషన్ నాయక్ ఎన్నికయ్యాడు. హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్ కార్యాలయంలోరాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా అప్సర్ పాషా
దంతాలపల్లి: మండల ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా అప్సర్ పాషా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ విజయ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి బదిలీ కావడంతో అప్సర్ పాషాకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
ఆదర్శ పాఠశాల
విద్యార్థి ప్రతిభ
నెల్లికుదురు: బాల్యం నుంచే భారత దేశ ఉన్నతిని చాటేందుకే ప్రేరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆదర్శపాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మండల కేంద్రానికి చెందిన సింగారం దీక్షిత్ జరాత్‌లోని వాడ్‌నగర్‌లో అనుభవ పూర్వక నేర్చుకునే కార్యక్రమానికి ఎంపికై వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థిని ఉపాధ్యాయ బృందం అభినందించారు.
వీఓఏల సమస్యలు
పరిష్కరించాలి
గూడూరు: ప్రభుత్వం వీఓఏల కనీస వేతనం రూ.20వేలు ఇస్తూ, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని మండల వీఓఏల సంఘం బాధ్యులు శ్రీలత, యాకయ్య కోరారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీలో వీఓఏలుగా పనిచేస్తున్న వారు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే మురళీనాయక్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, శారద, వసంత, కుమారస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.


