గుడుంబా స్థావరాలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై దాడులు

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

గుడుంబా స్థావరాలపై దాడులు

మహబూబాబాద్‌ రూరల్‌/బయ్యారం: మహబూబాబాద్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో గల బయ్యారం మండలంలోని బాల్యతండా, జగ్నతండా, జగ్గుతండా, బయ్యారం గ్రామంతోపాటు మానుకోట మండలంలోని బోడగుట్ట తండా గ్రామంలోని నాటు సారాయి స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించామని ఎకై ్సజ్‌ సీఐ జి.చిరంజీవి మంగళవారం తెలిపారు. మహబూబాబాద్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌, డీటీఎఫ్‌ హైదరాబాద్‌ ఎస్టీఎఫ్‌ టీం సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆరుగురిపై కేసు నమోదు చేసి 18లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, 600లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామన్నారు. భూక్యా చమిలి, తేజావత్‌ రాజి, జినుక ఉపేందర్‌, కున్సోత్‌ సురేష్‌, భూక్య దేవిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరిని బయ్యారం తహసీల్దార్‌ నాగరాజు ఎదుట భైండోవర్‌ చేశారు. ఈదాడుల్లో ఎకై ్సజ్‌ సీఐలు నీరజ, అశోక్‌ కుమార్‌, ఎస్టీఎఫ్‌ సీఐ నాగరాజు, ఎకై ్సజ్‌ ఎస్సై కిరీటి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement