రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

May 20 2026 1:58 AM | Updated on May 20 2026 1:58 AM

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

● ఎమ్మెల్యే మురళీనాయక్‌

నెల్లికుదురు: సహకార సంఘం బలోపేతానికి, రైతాంగ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దానికి నిధర్శనమె నెల్లికుదురు మండల కేంద్రంలో డీసీసీ నూతన బ్యాంకు ఏర్పాటు అని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నూతన డీసీసీ బ్యాంకును డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీసీఓ వెంకటేశ్వర్లు, డీడీఎం, సాయిరాం, ఏజీఎం స్వాతి, మేనేజర్‌ శోభన్‌లతో కలిసి బ్యాంకు సేవలను ప్రార ంభించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పులి వెంకన్న, సొసైటీ చైర్మన్లు కాసం లక్ష్మిచంద్రశేఖరరెడ్డి, పొనుగోటి దేవేందర్‌రావు, గుండ వెంకన్న, నాయకులు ఎదళ్ల యాదవరెడ్డి, ప్రబాకర్‌ గౌడ్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement