పేదలకు చేయూత అందించాలి | - | Sakshi
Sakshi News home page

పేదలకు చేయూత అందించాలి

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

పేదలకు చేయూత అందించాలి

మహబూబాబాద్‌: పేదలకు చేయూతనందించాలని, రోటరీ క్లబ్‌ సేవలు మరింత విసృతం చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. రోటరీ క్లబ్‌ మానుకోట శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్‌లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. మహిళా సాధికరతను కూడా రోటరీ క్లబ్‌ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో టౌన్‌ సీఐ రఘుపతి రెడ్డి, రోటరీక్లబ్‌ మానుకోట శాఖ అద్యక్షుడు కిషోర్‌ కుమార్‌, సరేందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, నగేష్‌కుమార్‌, శంతన్‌రామరాజు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement