గూడూరు: మండలంలోని పలు ఫర్టిలైజర్, పురుగు మందులు, విత్తన విక్రయదారులు రైతులకు నాణ్యమైనవి, కల్తీలేనివి అందించాలని సీఐ వినయ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువుల మందుల దుకాణ యజమాను(డీలర్)లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ ప్రతీ ఒక్కరు షాపునకు సంబంధించిన అనుమతులతోపాటు విక్రయించే ప్రతీ దానికి ఒరిజినల్ బిల్లులు రైతులకు ఇవ్వాలన్నారు. అదేవిధంగా నాణ్యమైనవి అందించాలని, ఎవరైనా ఎలాంటి తప్పిదాలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండీ అబ్దుల్‌మాలిక్, ఎస్సై గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.


