గూడూరు: ఐకేపీలో పనిచేస్తున్న వీఓఏలను ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని మండల వీఓఏల సంఘం నాయకుడు బానోతు లక్ష్మణ్, దారం శ్రీలత డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐకేపీ జాక్ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు మేనేజర్ రవికుమార్, ఐకేపీ ఏపీఎం వీరయ్య, ఎస్సై గిరిధర్‌రెడ్డిలకు సమ్మె నోటీసు అందించారు. కార్యక్రమంలో వీఓఏలు బుర్ర శారద, గడీల వసంత, కుమారస్వామి, భాస్కర్, శ్రీలత, యాకయ్య పాల్గొన్నారు.


