రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆందోళన

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

తొర్రూరు రూరల్‌: మండలంలోని చీకటాయాపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రెవెన్యూ, పీఏసీఎస్‌ అధికారులతో వాగ్వివాదం చేసి రైతులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు పసుమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గన్నీ సంచులు, లారీలు లేక ధాన్యం కాంటాలు పెట్టకపోవడంతో వర్షం ఎప్పుడు వస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గత నలభై రోజులుగా ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ అంకూస్‌, నలమాస ప్రమోద్‌గౌడ్‌, కాలునాయక్‌, వెంకన్న పాల్గొన్నారు.

గడ్డికట్టలు దగ్ధం

కేసముద్రం: నిప్పంటుకుని రెండున్నర ఎకరాల గడ్డికట్టలు దగ్ధమైన సంఘటన మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేసముద్రంవిలేజ్‌కి చెందిన మాలోతు నరేష్‌ అనే రైతు తన రెండున్నర ఎకరాల గడ్డి కట్టలను పంటపొలంలో ఉంచాడు. ప్రమాదవశాత్తు గడ్డి కట్టలకు నిప్పంటుకుంది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే 150 గడ్డికట్టలు దగ్ధమయ్యాయి. దీంతో రూ.15వేల నష్టం వాటిల్లింది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న చొప్పకు నిప్పంటించారని, దీంతో గడ్డికట్టలు దగ్ధమయ్యాయని బాధిత రైతులు ఆరోపిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement