సందడిగా 2కే రన్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సందడిగా 2కే రన్‌ ప్రారంభం

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

సందడిగా 2కే రన్‌ ప్రారంభం

డోర్నకల్‌: స్థానిక రైల్వే స్టేషన్‌ సెంటర్‌ నుంచి పెద్ద చెరువు వరకు నిర్వహించిన 2కే రన్‌ సందడిగా సాగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రారంభమైన 2కే మారథాన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండేటి రాజకుమారిహరినాథ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.నిరంజన్‌, మైస్‌ చైర్‌పర్సన్‌ మాదా లావణ్యాశ్రీనివాస్‌, కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

గార్ల: గార్లలో 2కే రన్‌ను సర్పంచ్‌ బానోత్‌ పార్వతి హతీరాం, ఎంపీడీఓలు ప్రారంభించారు. కార్యక్రమంలో బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సూత్రపు జయశంకర్‌, పీడీ శ్రీను, కోచ్‌లు అలవాల పవన్‌సోమంత్‌, శంకర్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

బయ్యారం: మండలకేంద్రంలో గాంధీసెంటర్‌ నుంచి ప్రారంభమైన 2కే రన్‌ బయ్యారంలోని పలు వీధుల్లో కొనసాగింది. ఎంపీడీఓ దీపిక, ఎంఈఓ లక్ష్మ ణ్‌రావు, సర్పంచ్‌ శాంతికిషన్‌నాయక్‌, ఉపసర్పంచ్‌ ఉమారంజిత్‌ పాల్గొన్నారు.

ఇనుగుర్తి: మండల కేంద్రంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎస్సై కరుణాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తమ్మడపల్లి కుమార్‌, మలిశెట్టి శోభన్‌, వాలీబాల్‌ కోచ్‌ కుటికంటి కిరణ్‌, పొన్న కవిత, వెంకన్న పాల్గొన్నారు.

నెల్లికుదురు: మండల కేంద్రంలో 2కే రన్‌లో ఎస్సై చిర్ర రమేష్‌ బాబు, ఎంపీఓ పద్మ, సర్పంచ్‌ పులి వెంకన్న, వివిధ శాఖల అధికారు, యువకులు పాల్గొన్నారు.

గూడూరు: మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ప్రధాన బస్టాండ్‌ సెంటర్‌ వరకు 2కే రన్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ర్పంచ్‌ వాంకుడోతు సునీతకొమ్మాలునాయక్‌, ఎంఈఓ సుజాత, సీఐ వినయ్‌కుమార్‌, ఎస్సై గిరిధర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చంటి స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కురవి: కురవి, సీరోలు మండల కేంద్రాల్లో మండల స్థాయి మారథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు వీరబాబు, గౌస్‌, ఎంఈఓ బాలాజీ, ఎస్సైలు సతీష్‌, సంతోష్‌, పీఈటీలు, పీడీలు, మాజీ క్రీడాకారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

దంతాలపల్లి: ప్రగతి ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన 2కే రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్సర్‌పాషా, ఎంఈఓ శ్రీదేవి, హెచ్‌ఎం వేణుమాధవరెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement