చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్ధులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కిరాణవర్తక సంఘం భవనంలో వాసవిమాత కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో టెన్త్‌, ఇంటర్‌, జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ కనబర్చిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణ వ్యక్తిగత ఎదుగుదలకు విజయానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు డీఎస్పీ, సీఐ అంజలి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఆర్య్యవైశ్య కార్పొరేషన్‌ బాధ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డీఎస్పీ తిరుపతిరావు

Advertisement
 
Advertisement
Advertisement