కేసముద్రం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసగించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని మహముద్‌పట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచకుండా, ఎన్నికల తర్వాత ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారన్నారు. కార్యక్రమంలో మహముద్‌పట్నం సర్పంచ్ కట్ల ఎల్లయ్య, సప్పిడిగుట్టతండా సర్పంచ్ బానోత్ భద్రు, భుక్యారాంతండా సర్పంచ్ జాటోత్ సోమీ, ఉపసర్పంచులు అమృత శ్రీనివాస్, దారావత్ మహేందర్, మిట్టగడుపుల యాకుబ్ పాల్గొన్నారు.
పెట్రోల్ ధరలు తగ్గించాలి
పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ సోమవారం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బాల యాకుబ్‌రెడ్డి, చాగంటి కిషన్, నీరుటి జలేందర్, జల్లె జయరాజ్ పాల్గొన్నారు.


