కేసముద్రం: మక్క రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు మక్కలను కొనుగోలు చేయాలని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను మార్కెట్ షెడ్‌లలో గోదాంలలో నెట్ వేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3.69లక్షల బస్తాలను కొనుగోలు చేశామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో మక్కలను పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరిపేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతికిరణ్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావు, ఏఓ వెంకన్న, సీఈఓలు మల్లారెడ్డి, ఎల్లయ్య, వల్లందాసు రవి పాల్గొన్నారు.


