ఆత్మలకు పింఛన్‌! | - | Sakshi
Sakshi News home page

ఆత్మలకు పింఛన్‌!

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026

జిల్లాలోని పింఛన్‌ లబ్ధిదారులు

ఎఫ్‌ఆర్‌సీతో గ్రామాల్లో గుట్టురట్టు

పట్టణాల్లో ఏరివేసే పనిలో అధికార యంత్రాంగం

వృద్ధ్యాప్యం: 43,109

దివ్యాంగులు: 14,556

వితంతు 39,967

వృద్ధ్యాప్యం: 43,109

దివ్యాంగులు: 14,556

వితంతు: 39,967

సాక్షి, మహబూబాబాద్‌: చేయూత పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గత ఏడాది జూలై నుంచి ముఖ గుర్తింపు పద్ధతి(ఎఫ్‌ఆర్‌ఎస్‌ )ద్వారా పింఛన్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పద్ధతిలో పింఛన్‌ ఇవ్వడం ప్రారంభించారు. అయితే గత ఏడాది మార్చిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 94,399 మంది పింఛన్‌దారులు ఉండేది. కాగా, ఎఫ్‌ఆర్‌ఎస్‌ పద్ధతిలో వరుసగా మూడు నెలలు పింఛన్‌ తీసుకోకపోతే పేరు తొలగించే ప్రక్రియ చేపట్టారు. దీంతో ఇప్పుడు పింఛన్‌దారుల సంఖ్య 91,597కు చేరింది. అంటే 2,702 మంది పింఛన్‌దారులను జాబితా నుంచి తొలగించారు. ఇందులో సగం మంది చనిపోయిన వారు ఉంటే.. మిగిలిన సగం పింఛన్లు బినామీలవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

మున్సిపాలిటీల్లో వడపోత..

గ్రామీణ ప్రాంతాల్లో అయితే చనిపోయిన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. కానీ పట్టణాల్లో గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పింఛన్‌ డబ్బులు బ్యాంకుల ద్వారా అందజేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన వారి పింఛన్‌ డబ్బులు కాజేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ మండలాల్లో మొత్తం 12,569 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వెయ్యిమంది చనిపోయిన వారి పింఛన్లు కొనసాగుతున్నాయని అంచనా. దీనిని సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌తో ముఖం, కళ్లు స్కాన్‌ చేసి లబ్ధిదారుడు సజీవంగా ఉన్నాడా.. లేడా అనేది నిర్ధారణ చేస్తున్నారు. ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లోని ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నేరుగా పింఛన్‌దారుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈనెలలో ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల వరకు చనిపోయిన వారిపేర్లు తొలగించనున్నారు. అయితే పట్టణాల్లో ప్రతీనెల కాకుండా మూడు నెలలకోసారి ఎఫ్‌ఆర్‌ఎస్‌ తీసుకొని నిర్ధారించాలని సూచించారు.

ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం

పింఛన్‌ పంపిణీలో చనిపోయిన వారి వివరాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత ఏడాది జూలై నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వడపోత ప్రక్రియ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించాం. పట్టణాల్లో ఈ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. యాప్‌ద్వారా సదరు వ్యక్తి బతికే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే పింఛన్‌ అందజేస్తారు.

– మధుసూదన్‌ రాజు, డీఆర్‌డీఓ

నేతకార్మికులు

359

గీత కార్మికులు

2,809

ఒంటరి మహిళలు

2,956

ఇతరులు : 510

మొత్తం:

1,04,266

చనిపోయిన వారి పేరిట మంజూరు

‘గత ఏడాది జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో చనిపోయిన వారి పేరిట పింఛన్‌ డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగడం, అసలు మనిషే లేకుండా పింఛన్‌ పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదైనట్లు స్పష్టమైంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బాధ్యుల నుంచి రికవరీ చేయించినట్లు తెలిసింది.’

‘మహబూబాబాద్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి ఏడాది కిత్రం మరణించాడు. అయితే అతడి పేరున బ్యాంకులో నెలనెలా పింఛన్‌ డబ్బులు జమ అవుతున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగి.. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కుమ్మకై ్క వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.’

Advertisement
 
Advertisement
Advertisement