టీబీపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

టీబీపై అవగాహన కల్పించాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

నెహ్రూసెంటర్‌: టీబీ వ్యాధిపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టీబీ సూపర్‌వైజర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. టీబీ అనుమానితుల గుర్తింపు, నిర్ధారిత రోగులకు చికిత్స, పర్యవేక్షణ అంశాలపై దృష్టి సారించాలని వైద్య సిబ్బంది ఆదేశించారు. టీబీ కార్యక్రమాల అమలు, లక్ష్యాలు, పనితీరుపై సమీక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో డాక్టర్‌ అర్జున్‌, డెమో కొప్పు ప్రసాద్‌, అశోక్‌, సిబ్బంది ఎస్‌టీఎల్‌ఎస్‌లు, టీబీ సూపర్‌వైజర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement