ప్రజలపై పెట్రోల్‌ భారం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ప్రజలపై పెట్రోల్‌ భారం సరికాదు

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

ప్రజలపై పెట్రోల్‌ భారం సరికాదు

తొర్రూరు: ప్రజలపై పెట్రోల్‌ భారం మోపడం సరికాదని సీపీఎం జిల్లా నాయకుడు బొల్లం అశోక్‌, ఎండీ యాకూబ్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్‌ కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు కంచర్ల వెంకటాచారి, నాయకులు జమ్ముల శ్రీను, మార్క సాంబయ్య, కొత్త వెంకట్‌రెడ్డి, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

మరిపెడ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్‌ చేశాడు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎండీ అబ్దుల్‌ రశీద్‌, పట్టణ కార్యదర్శి పల్లెపాక యాకన్న, అంజి, నరేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement