బాధిత కుటుంబానికి ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

కేసముద్రం: మండలంలోని కల్వల గ్రామానికి చెందిన కందిపాటి రాము అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో నిరుపేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో, భార్య త్రివేణి, మూడేళ్ల కూతురు గాయత్రి, నాలుగు నెలల కుమారుడు వేదాంశ్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్‌ తన మిత్ర బృందం కలిసి పలువురు దాతల సహకారంతో, హైదరాబాద్‌కు చెందిన ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ సిబ్బంది కలిసి మొత్తంగా రూ.5.64లక్షలను జమ చేశారు. ఆదివారం కల్వల గ్రామపంచాయితీ ఆవరణంలో కేసముద్రం మార్కెట్‌ చైర్మన్‌ గంట సంజీవరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.5.64లక్షల ఫిక్స్‌డ్‌ బాండ్‌ను(ఇద్దరు పిల్లల పేరున) అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వేల్పుల సుజాతరాంచంద్రయ్య, బొగ్గుల రాజేష్‌, బొగ్గుల హేమలత, కందిపాటి రాజు, ఆరెపు అనూప్‌, ఇస్సంపల్లి ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement