నెహ్రూసెంటర్: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.అనంతరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి మదార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన పాలకులు సామాన్య ప్రజలకు అధిక భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఏఐకేఎంఎస్‌జిల్లా కార్యదర్శి బండపల్లి వెంకటేశ్వర్లు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.రాంసింగ్, పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు,కె.భాస్కర్‌రెడ్డి, యాకయ్య, రాజు, మౌలానా పాల్గొన్నారు.


