మహబూబాబాద్ రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతీ ఒక్కరు చట్టాలను గౌరవించాలని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. రౌడీషీటర్లు తమ పాత నేర ప్రవర్తనలను పూర్తిగా విడనాడి, మంచి పౌరులుగా మారాలని సూచించారు. ఎవరైనా తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై రాంచరణ్, సిబ్బంది పాల్గొన్నారు.


