నెహ్రూసెంటర్: అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్‌లైట్ స్మారక దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ కారణంగా మృతి చెందిన వారికి ఆదివారం హెచ్‌ఐవీ ఎయిడ్స్, ఎస్‌ఎస్‌కే ఆధ్వర్యంలో జీజీహెచ్ నుంచి నెహ్రూసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారికి మద్దతుగా నిలబడేందుకు, సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను, అపోహాలను తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో దిశా సీఎస్‌ఓ సారయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, ఎస్‌ఎస్‌కే మేనేజర్ రమేష్, కౌన్సిలర్ సరస్వతి, స్టాఫ్‌నర్సు జ్యోతి, గౌతమి పాల్గొన్నారు.


