గూడూరు: మండలంలోని బొద్దుగొండ వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నుంచి మేడారానికి నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. బొద్దుగొండ ఎన్‌హెచ్ 365 జాతీయ రహదారిపై గుంతలు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పాడి గేదెల పైకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెల్సుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


