మరిపెడ రూరల్: మరిపెడ పట్టణంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తి, సంప్రదాయం, సామాజిక హితం కలిసిన ఆధ్మాత్మిక వేడుక ఘనంగా జరిగింది. వెంపటి సూజాత ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించిన అమ్మవారికి ఒడి నింపే కార్యక్రమంలో లలితా సహస్రనామ పారాయణం, లింగార్చన, భజనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు అభినవ వేదమంత్రాలతో పూజలు నిర్వహించగా, ఆలయ చైర్మన్ దారా నాగరాజు పాల్గొన్నారు. మహిళల ఐక్యత, సేవాభావం, దైవభక్తి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పనులు పూర్తిచేయాలి
మరిపెడ రూరల్: తాగునీటి పైపులైన్, డ్రెయినేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో 3వ వార్డులో జరుగుతున్న తాగునీటి పైపులైన్, డ్రెయినేజీ వ్యవస్థ పనులను ఆయన పరిశీలించారు. పైపులైన్ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ పానుగోలు రాములు, సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి సీతక్కను కలిసిన నూనావత్ రాధ
మహబూబాబాద్ రూరల్: జిల్లాకు చెందిన నూనావత్ రాధ ఇటీవల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 21వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను రాధ ఆహ్వానించారు.
ఎస్సీకాలనీలో నీటి ఎద్దడి
మహబూబాబాద్: ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని నాయకులు ఖాదర్‌బాబా, గద్దపాటి సంతోష్ డిమాండ్ చేఽశారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసులు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్‌భగీరథ పైపులైను పూర్తిస్థాయిలో ఉందన్నారు. కాలనీలో కనెక్షన్‌లు ఇవ్వకపోవడంతో నీటిసరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీరయ్య, రాజు, శ్రీను, ఉమా, పద్మ, నాగలక్ష్మి, రేణుక పాల్గొన్నారు.
బడిబాట
ఇనుగుర్తి: మండల కేంద్రంలోని చిన్నముప్పారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాయిలీ భవాని శేఖర్, హెచ్‌ఎం వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
వాలీబాల్ క్రీడాకారులకు చేయూత
ఇనుగుర్తి: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి ఆదివారం తెలంగాణ క్రీడా పోలీస్ టీం కోచ్ ఓరుగంటి మురళీ, ప్రొఫెసర్ ఓరుగంటి మధు సోదరులు కలిసి క్రీడాకారులకు రూ.15వేల విలువైన షోల్డర్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, న్యాప్‌కిన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోచ్ కూటికంటి కిరణ్, గాడుదుల మధు, రహీం, శ్రీనివాస చారి పాల్గొన్నారు.


