ఆర్డీఓ కార్యాలయాల్లో అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ కార్యాలయాల్లో అంతంతే..

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

ప్రజావాణికి స్పందన కరువు

మహబూబాబాద్‌: కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు చాలా వరకు పెండింగ్‌లో ఉండడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గుతుంది. ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ప్రజల నుంచి ఆసక్తి కనబడడం లేదు. అందుకు నిదర్శనమే చేపట్టిన నాటి నుంచి జరిగిన రెండు ప్రజావాణిల్లో దరఖాస్తుల సంఖ్య అంతంత మాత్రమే ఉంది. దరఖాస్తుదారుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. రెండు ప్రజావాణిల్లో ఇప్పటి వరకు 60దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

రెండు ఆర్డీఓ కార్యాలయాల్లో..

కలెక్టర్‌ కార్యాలయంతోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించాలని ఈనెల 4వ తేదీ నుంచి జిల్లాలోని మానుకోట, తొర్రూరు ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని అధికారులు నిర్వహిస్తున్నారు. మానుకోట ఆర్డీఓ కార్యాలయం పరిధిలో మానుకోట, కేసముద్రం, ఇనుగుర్తి, డోర్నకల్‌, కురవి, సీరోలు, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. తొర్రూరు ఆర్డీఓ కార్యాలయం పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, పెద్దవంగర, నర్సింహులపేట, మరిపెడ, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలు ఉన్నాయి.

మానుకోటలో అంతంత మాత్రమే

ఆర్డీఓ కార్యాలయాలలో ప్రజావాణికి పెద్దగా స్పందన లేదు. డివిజన్‌ స్దాయి అధికారులు సకాలంలో హాజరైనా వినతులు ఇచ్చేందుకు పెద్దగా రావడం లేదు. దీంతో అఽధికారులు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. వారి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కలెక్టర్‌ కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండడంతో కలెక్టర్‌కు ఇస్తేనే న్యాయం జరుగుతుందని, కలెక్టరేట్‌ వెళ్లడంతో ఆర్డీఓ కార్యాలయాలలో పెద్దగా స్పందన లేదు. కలెక్టర్‌కు ఇస్తేనే పరిష్కారం కావడం లేదని అలాంటి ఆర్డీఓలకు ఇస్తే ఫలితం ఉంటుందా అనే ఆలోచనతో ఆర్డీఓ కార్యాలయాలకు ప్రజలు పెద్దగా రావడం లేదు.

దరఖాస్తుదారుల కోసం అధికారుల

ఎదురుచూపు

రెండు ప్రజావాణిల్లో వచ్చిన

వినతులు 60మాత్రమే

Advertisement
 
Advertisement
Advertisement