మహబూబాబాద్ అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈదులపూసపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఆఫ్రాతబుసంను కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్‌రావులు సన్మానించి నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పూజరి వీరయ్య, డీఈఓ సత్యరానాయణమూర్తి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఓంప్రకాష్, ప్రభాకఱ్, చాంప్లానాయక్, శ్రీనివాస్‌రావు, నాగరాజు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచాల సాయిదీప్తి, మంచాల అభిరామ్ వేసవి శిబిరం ఆర్ట్, క్రాఫ్ట్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని హెచ్‌ఎం కె.గిరిజ, ఉపాధ్యాయుడు రామసహాయం శ్రీధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి అభినందించారు.
గార్ల: గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 464 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచిన రావుక సిద్ధిజైన్‌ను కలెక్టర్ సన్మానించారు.
రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేత
నెల్లికుదురు: మండలంలోని ఆలేరులో హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న జాతీయస్థాయి క్రీడాకారుడు బానోతు యశ్వంత్‌కు రూ.10వేల నగదు పోత్సాహకం కలెక్టర్ స్నేహా శబరీష్ చేతుల మీదుగా అందజేశారు.
దంతాలపల్లి: మండల కేంద్రంలోని విద్యార్థులు శశికాంత్, రేష్మిత ఆర్ట్, క్రాప్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నట్లు హెచ్‌ఎం వేణుమాధవరెడ్డి తెలిపారు.
చిన్నగూడూరు: పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ జయ్యారం పాఠశాలకు చెందిన విద్యార్థిని జి.సౌజన్య ప్రతిభ కనబరిచి మండలస్థాయిలో ప్రథమస్థానం సాధించింది. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నట్లు హెచ్‌ఎం ఉషశ్రీ తెలిపారు.


