మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కళాశాలలో చదువుతున్న వివిధ విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన విద్యార్థులను సంఘ సంస్కర్త నాగేంద్రను ప్రిన్సిపాల్ బి.లక్ష్మణ్‌నాయక్, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అన్నపూర్ణ, సుమలత, ఐక్యూసీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్, మసూద్‌ఆహ్మద్, సాంబశివరావు, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
బయ్యారం: పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను విద్యావారోత్సవాల్లో భాగంగా ఆదివారం బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మినారాయణ, రామేశ్వరరావు, రవిందర్, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, విజయ తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం: ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని అప్పుడే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని కల్వల జెడ్పీహైస్కూల్‌కి చెందిన సహస్ర(561), నవ్య(558), అనూష(554) విద్యార్థినులు పదిలో మార్కులు సాధించారు. ఆదివారం విద్యార్థినులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాత, రాంచంద్రయ్య, హెచ్‌ఎం బండారు నరేందర్, గండి శ్రీనివాస్, మోడెం రవీందర్‌గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


