సీఐ మహేందర్‌ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

సీఐ మహేందర్‌ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుశాఖ తెలంగాణ మల్టీ జోన్‌– 1 పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 35 మంది సీఐలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల కాగా.. అందులో టౌన్‌ సీఐ మహేందర్‌ రెడ్డి ఉన్నారు.

పట్టాలపై పరుగులు

ట్రాక్టర్‌ ఇంజన్‌కు గూడ్స్‌ బోగీ జత

కురవి: రోడ్డుపై నడిచే ట్రాక్టర్‌ ఇంజన్‌ పట్టాలపై పరుగులు పెట్టడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టర్‌ ఇంజన్‌కు గూడ్స్‌ డబ్బాను తొట్టిగా ఏర్పాటు చేసి రైల్వే పనులకు ఉపయోగపడేలా తయారు చేశారు. కాగా బుధవారం గుండ్రాతిమడుగు(విలేజి) వద్ద పట్టాలపై ట్రాక్టర్‌ ఇంజన్‌ పరుగులు తీయడాన్ని సాక్షి తన కెమెరాలో బంధించింది. రైల్వే పనులకు కంకరను తొట్టిలో పోసుకుని వేరే ప్రాంతానికి పట్టాలపై తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇంజన్‌కు డబ్బాను జత చేసి ఉపయోగించుకోవడం అద్భుతమైన ఆలోచన అని పలువురు అభివర్ణిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement