మార్కెట్‌ ఎదుట మక్కల ట్రాక్టర్ల క్యూ.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ఎదుట మక్కల ట్రాక్టర్ల క్యూ..

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోలు కేంద్రానికి ఆది వారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రెతులు ట్రాక్టర్‌లలో మక్కలను తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గేటుకు తాళం తీయకపోవడంతో మండుటెండల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు రైతులు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు మిల్లులను, దుకాణాలను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చింది. మార్కెట్‌లో ఇప్పటికే ఖరీదు చేసిన 6వేల బస్తాల మక్కల కాంటాలు పూర్తయినప్పటికీ, లారీల కొరతతో ఎగుమతి కాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. తీరా సాయంత్రం గేటు తెరిచి, మహముద్‌పట్నం, అమీనాపురం ఉమ్మడి జీపీల నుంచి వచ్చిన మక్కల ట్రాక్టర్‌లను లోనికి పంపించారు. కాగా ప్రస్తుతం 15వేల బస్తాల మక్కలు షెడ్లలో పేరుకుపోయాయి. మార్కెట్‌లో మక్కల రాశులు పేరుకుపోయినందున, తిరిగి తేదీ ప్రకటించేంత వరకు రైతులు తమ మక్కలను మార్కెట్‌కు తీసుకురావద్దని చైర్మన్‌ గంట సంజీవరెడ్డి తెలిపారు. అదే విధంగా తాళ్లపూసపల్లి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రంలో బస్తాలు లేకపోవడంతో మక్క రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement