నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

మహబూబాబాద్‌: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం తాగునీరు తదితర అంశాలపై సంబంఽధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మిషన్‌ భగీరఽథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకొని నీటి సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement