న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
7
‘ఈ ఫొటోలోని యువకుడి పేరు పాశం రాజు. ఇటీవల తొర్రూరులో మన చద్దన్నం పేరిట చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ పెట్టాడు. సెంటర్ నిర్వహణకు 10 రోజులకో గ్యాస్ సిలి ండర్ అవసరం. ప్రస్తుతం సిలిండర్లు అందుబాటులో ఉండడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచింది. బ్లాక్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.6వేల వరకు పలుకుతోంది. అంత వెచ్చించే స్థోమత లేక ఒకటి రెండు మిల్లెట్స్ మాత్రమే చేస్తున్నాడు. దీంతో పూర్తిగా గిరాకీ తగ్గి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. నెలకు రూ.16వేల అద్దె, సామగ్రి కొనుగోలు కష్టంగా మారడంతో కుటుంబ పోషణ భారమైంది’.
‘పై ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రేఖ–సోమయ్య దంపతులు. ప్రతీరోజు టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ, పూరి, దోస అమ్మేవారు. వారం రోజులుగా సిలిండర్ సరఫరా లేకపోవడంతో నాలుగు రోజుల నుంచి హోటల్ తెరవడం లేదు. ఇంట్లో ఇబ్బందులు ఎదురుకావడంతో ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై చపాతి, ఇడ్లీ తయారు చేసుకొని హోటల్ వద్దకు వచ్చి అమ్ముతున్నారు. అయితే వేడిగా లేవని కస్టమర్లు తినడం లేదని, గ్యాస్ కొరత తీరిస్తే తప్ప తమ కుటుంబం గడవదని సోమయ్య దంపతులు వాపోతున్నారు’.


