క్రీడలు ఆరోగ్యానికి దోహదం | - | Sakshi
Sakshi News home page

క్రీడలు ఆరోగ్యానికి దోహదం

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

ఎస్పీ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ శబరీష్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ సాయుధ దళ విభాగం (ఏఆర్‌)లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ లింగయ్య క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎస్పీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడలపై ఏఆర్‌ కానిస్టేబుల్‌ లింగయ్య అంకితభావాన్ని ప్రశంసిస్తూ భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, ఆయన విజయాలు ఇతరులకు ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ తరఫున లింగయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ విజయప్రతాప్‌, ఆర్‌ఎస్సై శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement