పునర్విభజనలో మరో తొమ్మిది! | - | Sakshi
Sakshi News home page

పునర్విభజనలో మరో తొమ్మిది!

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్‌లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది.

కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం..

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్‌ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్‌ పశ్చిమ, పరకాల), వరంగల్‌లో మూడు (వరంగల్‌ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి), మ హబూబాబాద్‌లో రెండు (మహబూబాబాద్‌, డోర్నకల్‌), జేఎస్‌ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు)లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది.

‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు

హనుమకొండలో ఆరు, వరంగల్‌లో ఐదు.. మానుకోటలో నాలుగు..

జేఎస్‌ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులలో యథాతథం

ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు

2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం..

ఆ ప్రకారమే 2029 ఎన్నికలు..

కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా డీలిమిటేషన్‌

జిల్లా నియోజకవర్గాలు మొత్తం

ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు

హనుమకొండ 02 04 10,80,858 06

వరంగల్‌ 03 02 8,90,651 05

జేఎస్‌ భూపాలపల్లి 01 01 4,16,763 02

జనగామ 03 00 5,66,376 03

మహబూబాబాద్‌ 02 02 77,45,49 04

ములుగు 01 00 25,77,44 01

12 09 39,87,241 21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement