కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్‌హాల్‌లో ‘అడ్వాన్స్‌సెస్‌ ఇన్‌లైఫ్‌ సైన్స్‌సెస్‌ ప్రజెంట్‌ ఫ్యూచర్‌’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్థాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కర్నాటి రాయ్‌.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జువాలజీ విభాగం ప్రొఫెసర్‌ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌, ఆ విభాగం ప్రొఫెసర్‌ షిమిత, ప్రొఫెసర్‌ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి. వెంకటగోపినాఽథ్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్‌స్ట్రాక్ట్‌ సావనీర్‌ను వీసీ ప్రతాప్‌రెడ్డి అతిథులు ఆవిష్కరించారు.

‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం..

తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్‌ కమిటీ హాల్‌లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్‌పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement