కష్టపడితే అన్నీ సాధ్యమే | - | Sakshi
Sakshi News home page

కష్టపడితే అన్నీ సాధ్యమే

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

హసన్‌పర్తి: నిరంతం కష్టపడడంతోపాటు గెలవాలనే కోరిక బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మనోజ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కిట్స్‌ 37వ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి మనోజ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో నైపుణ్యం పెంపొందుతుందన్నారు. ఐటీ కన్సల్టెంట్‌(అమెరికా సాఫ్ట్‌వేర్‌ డైవలపర్‌) సీవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ శారీరక ధృఽఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా అతిథులను సన్మానించారు. కిట్స్‌ కళాశాల అదనపు సెక్రటరీ సతీశ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అశోక్‌రెడ్డి, కళాశాల ఏఓ రమేశ్‌రెడ్డి, పీడీ శ్రీనివాస్‌రెడ్డి,రిజిస్ట్రార్‌ కోమల్‌రెడ్డి, ప్రభా కరాచారి, స్పోర్ట్‌క్లబ్‌ విద్యార్థి అధ్యక్షులు విశాల్‌ ఆదిత్య, టి.కార్తీక్‌, క్లబ్‌ కో–ఆర్డినేటర్లు పి.లక్ష్మీరెడ్డి, వర్షిత, యశ్వంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ బ్మాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు మనోజ్‌కుమార్‌

కిట్స్‌లో ఘనంగా క్రీడా వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement