కల్తీ కారం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కల్తీ కారం పట్టివేత

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

వరంగల్‌: ఏనుమాముల పీఎస్‌ పరిధిలోని లక్ష్మీసాయి ఇండస్ట్రీస్‌లో 60 కల్తీ కారం బస్తాలను పట్టుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జువ్వాజి సురేశ్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం లక్ష్మీసాయి ఇండస్ట్రీస్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లతో కలిసి తనిఖీలు నిర్వహించగా కల్తీకారం బస్తాలు లభ్యంకావడంతో సీజ్‌ చేశామన్నారు. సీనియర్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌనిక.. పట్టుకున్న కల్తీకారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా, నిందితుడు గోనె సంపత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై రాజు పాల్గొన్నారు.

ఆత్మహత్యకు యత్నించిన

వ్యక్తిని కాపాడిన కానిస్టేబుళ్లు

ఖిలా వరంగల్‌: రైలు పట్టాలపై మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని 100 నంబర్‌కు ఫోన్‌ రాగా.. సమీపంలోని మిల్స్‌కాలనీ బ్లూకోల్ట్స్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లు వాజిత్‌, బాలరాజ్‌ హుటాహుటిన రైలు పట్టాలపైకి చేరుకున్నారు. ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడి అతడిలో మనోధైర్యం నింపారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. సరైన సమయానికి వచ్చి ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులకు స్థానికులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement