అసెంబ్లీలో ప్రస్తావన | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ప్రస్తావన

Mar 25 2026 7:53 AM | Updated on Mar 25 2026 7:53 AM

వెంకటాపూర్‌ భూ ఆక్రమణలపై

న్యూశాయంపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌ గ్రామంలో సర్వే నంబర్‌ 324లో కబ్జాదారులు ఆక్రమించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. అసైన్డ్‌ భూమి మార్పిడి కావడానికి వీలు లేదని పీఓటీ చట్టంలో ఉందన్నా రు. అలాంటిది అధికారుల సహకారం లేకుండా పే దలకు అసైన్డ్‌ చేసిన భూమి కేవలం ఒకే కుటుంబా నికి ఎలా మార్పిడి చెందుతుందని ప్రశ్నించారు. ఈ భూమి విషయంలో 20 సంవత్సరాలుగా గ్రా మానికి చెందిన దళితులు, నిరుపేదలు ఆందోళనలు నిర్వహించి పలుమార్లు కలెక్టర్‌, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయినా పట్టించుకోవడం లేదని గళమెత్తారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలనికోరారు. కాగా, సదరు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని పార్టీ జిల్లా కమిటీ బా ధ్యులు మంగళవారం కూనంనేనికి వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. దీనిపై సాంబశివరావుకు పార్టీ జిల్లా పక్షాన కార్యదర్శి కర్రె భిక్షపతి ధన్యవాదాలు తెలిపారు. భూమి దక్కే వరకూ పోరాటాలు చేస్తుంటామన్నారు. నాయకులు టి. భి క్షపతి, ఎల్లేశ్‌, శ్రీనివాస్‌, కరుణాకర్‌, వెంకట్రాజం, రవి, రాజు, యాకూబ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement