కుటుంబ కలహాలతో ప్రైవేట్‌ టీచర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ప్రైవేట్‌ టీచర్‌ ఆత్మహత్య

Mar 12 2026 8:30 AM | Updated on Mar 12 2026 8:30 AM

హసన్‌పర్తి: కుటుంబ కలహాలతో ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని సీతంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోకల మమత(36) నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అయితే కొంతకాలంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక వేదనకు గురైన మమత ఈనెల 9న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు బుధవారం తెలిపారు.

మనస్తాపంతో

చౌటపల్లిలో మహిళ..

పర్వతగిరి: మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మండలంలోని చౌటపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రమాదేవి(48) కూతురుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఇటీవల విడిపోయారు. అనంతరం కూతురు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పోయింది. దీంతో రమాదేవి అప్పటి నుంచి మనోవేదనకు గురవుతోంది. ఈ క్రమంలో బుధవారం ఎల్లమ్మ పండుగ సందర్భగా కూతురు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో కూతురు ఇంటి నుంచి వెళ్లిన విషయం తలుచుకుని రమాదేవి మనస్తాపంతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి భర్త కొంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సీతంపేటలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement