వేగం కన్నా.. ప్రాణం మిన్న | - | Sakshi
Sakshi News home page

వేగం కన్నా.. ప్రాణం మిన్న

Mar 11 2026 8:54 AM | Updated on Mar 11 2026 8:54 AM

వేగం కన్నా.. ప్రాణం మిన్న

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: వేగం కన్నా.. ప్రాణం మిన్న అని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రవి, అడిషనల్‌ డీసీపీ ప్రభాకర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, రవాణా శాఖ ఉప కమిషనర్‌ సురేశ్‌రెడ్డి, సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌ పాల్గొన్నారు.

ప్రణాళిక పటిష్టంగా అమలు

జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్‌రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి, పలు శాఖల జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు.

రోడ్డును విస్తరించాలి

హసన్‌పర్తి: హసన్‌పర్తి పెద్ద చెరువు మలువు వద్ద రోడ్డును విస్తరించాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. సోమవారం హసన్‌పర్తి పెద్ద చెరువు కట్ట మూల మలుపు బ్లాక్‌ స్పాట్‌ను కలెక్టర్‌ సందర్శించారు. కార్యక్రమంలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా వరంగల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ భరద్వాజ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, ఆర్డీఓ రమేశ్‌రాథోడ్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, నీటి పారుదల శాఖ డీఈఈ రమాకాంత్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరాలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement