కాజీపేట రూరల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల డిమాండ్ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ మేరకు సోమవారం బీఆర్‌ఎస్ బృందంతో కలిసి సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోచ్ ఫ్యాక్టరీకి భూమిని ఇచ్చిన అయోధ్యపురం భూ నిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగావకా శాలు కల్పించాలని, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులతో మాట్లాడి కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చామని, లాతూర్‌లో ఎలాగైతే స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారో అదేమాదిరి కాజీ పేటలో కూడా భూనిర్వాసితులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వి జ్ఞప్తి చేశారు. దీనికి రైల్వే జీఎం స్పందించి కాజీపేట డివిజన్ ఏర్పాటు అంశం బోర్డు దృష్టికి తీసుకెళ్తానని, అయోధ్యపురం భూ నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వినోద్‌కుమార్, అరూరి రమేశ్ తెలిపారు. అనంతరం అయోధ్యపురం భూ నిర్వాసితులతో కలిసి జీఎంకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు నార్లగిరి రమేశ్, దువ్వ కనకరాజు, కె.శంకర్, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలి
మాజీ ఎంపీ వినోద్‌కుమార్,
మాజీ ఎమ్మెల్యే అరూరి


