గూడూరు: పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించి ఉత్తమ మార్కులు సాధించేలా ధైర్యం చెప్పాలని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎం.సంతోష్ అన్నారు. మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను సందర్శించి, బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బాలికలతో ముచ్చటించి ధైర్యం నింపారు. అనంతరం ఎంఈఓ కార్యాలయంలో పలు పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆరో గ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం ఆన్‌లైన్ అటెండెన్స్‌పై సమీక్ష నిర్వహించి సీఆర్‌పీలు, ఎంఆర్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలం నుంచి 508 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈఓ రవికుమార్ తెలిపారు.
ఐకేపీ కార్యాలయం తనిఖీ
కురవి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డీఆర్‌డీఓ జి.మధుసూదన్‌రాజు మండల కేంద్రంలోని గాయత్రి మండల సమాఖ్య కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఫైల్స్ నిర్వహణ, పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు భాగాన్ని చదును చేయాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. 99రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కార్యాలయంలో క్రమం తప్పకుండా క్లీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఏపీఎం దుర్గారావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి శారద, సిబ్బంది రామారావు, సతీష్, ఇందిర, ఉష, సులోచన, మంగమ్మ, వెంకటరమణ, ఎంఎస్ అకౌంటెంట్ శోభ, ఆపరేటర్ జననీదేవి, సీఈఓ ప్రసాద్, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థినులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించి విద్యార్థినులకు స్టడీ మెటీరియల్, నైట్ డ్రెస్‌లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ ఉపేందర్, హెచ్‌ఎం పొడుగు నర్సయ్య, డీఆర్పీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ
కొత్తగూడ: మండలంలోని పొగుళ్లపల్లి హైస్కూ ల్‌ను డీఈఓ రాజేశ్వర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీ లించారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాసేవిధంగా పలు సూచనలు చేశారు. పాఠశాల రికార్డులను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


