రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. బ్యాటరీ బైక్ కోసం దరఖాస్తు చేసుకున్న.. ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. 20సార్లు కలెక్టరేట్‌లో వినతులు ఇచ్చాను. డిగ్రీ పూర్తి చేసి కిరాణాషాపు పెటుకున్న. సామగ్రి తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బైక్ మంజూరు చేస్తే సమస్య తీరుతుంది.
– వి.శ్రీలత, దివ్యాంగురాలు, మానుకోట
దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు..
మా తండా శివారులో సుమారు 50సంవత్సరాలుగా పొలాలకు బండ్ల దారి ఉంది. ఆ దారి ఇవ్వకుండా కొంత మంది ఇబ్బంది పెడుతున్నారు. సాగు చేసుకోవడం, ధాన్యం తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుంది. అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలి.
– జర్పుల లోక్యా, బీచురాజుపల్లి(జర్పులతండా), మరిపెడ
●


