మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. అనంతరం సంబంధిత జిల్లా, మండలాల అధికారులతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. తక్షణమే దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని సూచించారు. హాస్టల్స్, విద్యాసంస్థలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. కాగా, ప్రజావాణిలో 136 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం పాల్గొన్నారు.
దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
ప్రజావాణిలో 136 వినతుల స్వీకరణ


