లాభసాటిగా అనిపించింది | - | Sakshi
Sakshi News home page

లాభసాటిగా అనిపించింది

Mar 10 2026 12:55 PM | Updated on Mar 10 2026 12:55 PM

నాకున్న 6 ఎకరాల్లో యాసంగి సీజన్‌లో వరి సాగుచేశా. మా ఏరియాలో వర్షాకాలంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. నీటి సామర్థ్యం వరి సాగుకు అనుకూలంగా ఉంది. మిగతా పంటలకంటే వరే కొంచెం లాభసాటిగా అనిపించింది.

– కీర్తి సంపత్‌, రైతు, షోడాషపల్లి, వేలేరు మండలం

తొమ్మిదెకరాల్లో వరి వేసిన..

నాకున్న ఆరు ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఇందులో మూడెకరాలు సన్నాలు, మరో మూడెకరాలు దొడ్డు రకం, ఇంకో మూడెకరాలు సీడ్‌ వరి వేసిన. వరి పంటకు మంచి డిమాండ్‌ ఉండడంతో పాటు మద్దతు ధర కూడా వస్తుండడంతో మొత్తానికి మొత్తం వరి వేసిన.

– ఎండపెల్లి తిరుపతిరెడ్డి, రైతు, కమలాపూర్‌

వరి సాగుతో పనిభారం తక్కువ..

మిగతా పంటలతో చూస్తే వరితో పనిభారం తక్కువుంటుంది. మార్కెట్‌లో డిమాండ్‌ కూడా ఉంది. కనీస మద్దతు ధరతోపాటు సన్నరకాలపై రూ.500 బోనస్‌ కూడా వస్తుంది. ఇతర పంటల కంటే వరి సాగులోనే లాభాలు ఉన్నాయి.

– హింగే మనోహర్‌, రైతు, పీచర, వేలేరు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement