మేడారంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

మేడారంలో భక్తుల సందడి

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

వనదేవతలకు మొక్కులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్‌ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. అలాగే సినీనటుడు బాబు మోహన్‌ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా బాబుమోహన్‌కు పూజారులు అమ్మవార్ల కండువా కప్పి ప్రసాదం అందజేశారు. జంపన్నవాగులో నీరు లేకపోవడంతో పాటు స్నానఘట్టాల వద్ద ఒక షెవర్‌ కూడా లేకపోవడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు.

Advertisement
 
Advertisement
Advertisement