తొర్రూరు: చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో నేటి నుంచి జాతీయ స్థాయి ఆహ్వానిత నాటిక పోటీలు తొర్రూరులో నిర్వహించనున్నారు. పట్టణంలోని గరుగుబావి వద్ద మొదలయ్యే నాటిక పోటీలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు డివిజన్ కేంద్రంలో ఆదివారం కళా సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. తొలిరోజు హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారిచే ‘ సీ్త్ర మాత్రే నమః’ నాటిక, ఈ నెల 10న కాకినాడ వారిచే ‘తితీక్ష’ నాటిక, 11న వైజాగ్ వారిచే ‘నీళ్లు నీళ్లు’, 12న గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారిచే ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక, గుంటూరు వారిచే ‘సహానా’, 13న విజయవాడ కళాకారులచే ‘మమ్మల్ని బతకనివ్వండి’నాటికలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీరోజు రాత్రి 7.30 గంటలకు ప్రదర్శనలు మొదలు కానున్నాయి. సమాఖ్య అధ్యక్షుడు మన్నూరు ఉమ, అసోసియేట్ అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పినాకపాణి, ప్రతినిధులు లేగల వెంకట్‌రెడ్డి, బుదారపు శ్రీనివాస్, మాచర్ల వెంకన్న, ఇమ్మడి రాంబాబు, రవి, భాస్కరాచారి పాల్గొన్నారు.


