పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

ఎమ్మెల్యే మురళీనాయక్‌కు

సీపీఎస్‌ ఉద్యోగుల వినతి

మహబూబాబాద్‌ రూరల్‌ : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర కార్యదర్శులు అవునూరి రవి, ముబీన్‌ అహ్మద్‌ అన్నారు. తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఓపీఎస్‌ అంశాన్ని తప్పనిసరిగా గుర్తుచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగముని, స్టేట్‌ ఐటీ సెల్‌ కన్వీనర్‌ మహమ్మద్‌ రఫీక్‌, జిల్లా కోశాధికారి కొప్పుల నాగరాజు, దస్తగిరి, దారావత్‌ వీరన్న, మేకల కుమార్‌, భూక్య రమేశ్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement