గార్ల: పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యంపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం గార్లలోని పలు ప్రభుత్వ పాఠశాలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గార్లలోని బాలికోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, గార్ల పట్టణంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది రోడ్లు, సైడ్ కాల్వల్లో ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపట్టి, వెంటనే పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఎత్తివేసి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. డీపీఓ వెంట సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, ఎంపీడీఓ మంగమ్మ, ఎంపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి బి రమేష్‌నాయక్, సిబ్బంది కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బయ్యారం: పంచాయతీలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీపీఓ హరిప్రసాద్ సూచించారు. శనివారం బయ్యారంలో పర్యటించారు. వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్పంచ్ శాంతికిషన్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉమారంజిత్‌యాదవ్, ఎంపీఓ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్


