భరత్‌కు 900 ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

భరత్‌కు 900 ర్యాంకు

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

జనగామ: నర్మెట మండలం మచ్చుపహాడ్‌ గ్రామానికి చెందిన దస్రు నాయక్‌, అనసూయ దంపతుల పెద్ద కుమారుడు భరత్‌ సివిల్స్‌లో 900వ ర్యాంకు సాధించారు. సివిల్స్‌ –2023లో 135వ ర్యాంకుతో ఐఎఫ్‌ఎస్‌ సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్‌లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోనే టెన్త్‌ పూర్తి చేసిన భరత్‌ ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివారు. అనంతరం బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ గ్రూప్‌–1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. సివిల్స్‌ లక్ష్యంగా తన ప్రిపరేషన్‌ కొసాగించారు. భరత్‌ తండ్రి దస్రూ లింగాలఘనపురం మండలం గుమ్మడవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భరత్‌ తమ్ముడు కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్‌ లిమ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో ఆఫీసర్‌ కేడర్‌లో పనిచేస్తున్నారు. కాగా, ఐఏఎస్‌ లక్ష్యంగా మరోసారి యూపీపీఎస్సీకి ప్రిపేర్‌ అవుతానంటున్నారు.. భరత్‌.

Advertisement
 
Advertisement
Advertisement