తల్లులకు తనివితీరా మొక్కులు | - | Sakshi
Sakshi News home page

తల్లులకు తనివితీరా మొక్కులు

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

తల్లు

తల్లులకు తనివితీరా మొక్కులు

తల్లులకు తనివితీరా మొక్కులు 8 లోu

న్యూస్‌రీల్‌

8 లోu
కాలనీల బాటపట్టిన అన్ని పార్టీల నాయకులు

మేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్‌ఎస్‌ తాడ్వాయి

మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..

బరిలో నిలిచిన అభ్యర్థులు వార్డుల ఓటరు జబితాను ముందు పెట్టుకొని ఓటర్లు ఎక్కడ ఉన్నారని అన్వేషణ మొదలుపెట్టారు. ఇంటి నంబర్లను ఆధారంగా తీసుకొని స్థానికంగా ఉన్నవారితోపాటు.. ఇల్లు మారిన వారు.. ఇతర ప్రాంతాల్లో ఉండేవారి వివరాలు, ఫోన్‌ నంబర్లు తీసుకొని నేరుగా మాట్లాడుతున్నారు. ఈనెల 11న తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగం చేస్తున్నవారికి వారి వారి కుటుంబ సభ్యుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ పట్టణాలకు ప్రత్యేక వాహనాలు పంపిస్తాం.. ఓటేసి వెళ్లండి అని అభ్యర్థిస్తున్నారు.

ఓటర్ల కోసం అన్వేషణ

ఇంటింటి ప్రచారం..

ఎన్నికల్లో నామినేషన్‌ వేసినప్పటికీ.. పార్టీల వారీగా కొందరికే బీ–ఫాం వచ్చింది. మిగిలిన వారు ఉత్కంఠగా ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే మంగళవారం గుర్తులు కేటాయించడంతో హుటా హుటిన ప్రింటింగ్‌ ప్రెస్‌లు, ఫొటోగ్రాఫర్ల వద్దకు వెళ్లి రాత్రికి రాత్రే డోర్‌ పోస్టర్లు, పోల్‌ చీటీలు, గుర్తుల పేపర్లను ప్రింట్‌ చేయించుకొని బుధవారం ఉదయం నుంచి ఇంటింటి ప్రచారం చేస్తూ పోస్టర్లు అతికిస్తున్నారు. అభ్యర్థులతో పాటు పలుచోట్ల కాంగ్రెస్‌ నుంచి మహబూబాబాద్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు ముర ళీ నాయక్‌, రాంచంద్రునాయక్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, మాలోత్‌ కవిత ఇతర అన్ని పార్టీల ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. దీంతో మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా.. గుంపులు గుంపులుగా పార్టీ ల జెండాలు, ప్రత్యేక ప్రచార వాహనాల హోరు కనిపించింది.

ప్రచార హోరు..

సాక్షి, మహబూబాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా పార్టీల బీ–ఫాంలు, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి పెరిగింది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీతోపాటు, సీపీఐ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో బుధవారం పార్టీల గుర్తులను చేతబూని అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు.

చేతినిండా పని..

కార్యకర్తలతో పాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని సాధారణ ప్రజలకు కూడా చేతినిండా పని దొరుకుతోంది. ఉదయం 7నుంచి సాయంత్రం 8గంటల వరకు ప్రచారం చేపడితే చాలు అన్నీ అభ్యర్థులే చూసుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో అయితే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం మాంసాహార భోజనం, సాయంత్రం భోజనం, మందుతో పాటు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పొద్దస్తమానం పనిచేసినా.. కూలీ గిట్టడం లేదని, ఎన్నికల పుణ్యమా అని తిండి, మందు, డబ్బులు వస్తున్నాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మేడారంలో తిరుగువారం పండుగ

ప్రతీ వార్డులో రాజకీయ క్యాంపులు

ఓటరు జాబితాను వడపోస్తున్న అభ్యర్థులు

ప్రజలను నేరుగా కలిసి ఓటు వేయాలని అభ్యర్థన

తల్లులకు తనివితీరా మొక్కులు1
1/5

తల్లులకు తనివితీరా మొక్కులు

తల్లులకు తనివితీరా మొక్కులు2
2/5

తల్లులకు తనివితీరా మొక్కులు

తల్లులకు తనివితీరా మొక్కులు3
3/5

తల్లులకు తనివితీరా మొక్కులు

తల్లులకు తనివితీరా మొక్కులు4
4/5

తల్లులకు తనివితీరా మొక్కులు

తల్లులకు తనివితీరా మొక్కులు5
5/5

తల్లులకు తనివితీరా మొక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement