రైతులకు ప్రయోజనం కలిగే పరిశోధనలు చేయాలి
హన్మకొండ: ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. గురువారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించారు. శాస్త్రవేత్తలతో సమావేశమై వ్యవసాయ పరిశోధనల ప్రగతి, రైతులకు అందిస్తున్న సాంకేతిక సహాయం, కొత్త పంటల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. అ నంతరం ఎంపీ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, రైతుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు. అలాగే, వరంగల్‌లోని టెక్స్‌టైల్స్ రంగాని కి అనుసంధానంగా ఇక్కడ పండించిన పత్తిని విని యోగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మిర్చి, మామిడి, పసుపు, పత్తి తదితర పంటలపై వరంగల్ ప్రాంతంలో పరిశోధనలు జరిగేలా ప్రతిపాదనలు అందిస్తే వాటిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అమలు అయ్యేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఉమారెడ్డి, అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ నాయక్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య


